బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలెమ్మా
వొల్లే వయ్యరమా నవ్వే మందారమా నన్నే కాజెసేనమ్మా
పట్టు చీరెల్లొ చందమామ ఏడు వన్నెల్లొ వెన్నెలమ్మా
కన్నె రూపాల కోనసీమ, కోటి తారల్లో ముద్దుగుమ్మ
ఎదురే నిలిచే అధర మధుర దరహాసం, ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం
వెలిగే అందం చెలికే సొంతం వసంతం .., వరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసే వరకు కలలో జరిగే విహారం
పుష్య మాసాల మంచు నీవో, భోగి మాటల్లో వేడి నీవో
పూల గాంధాల గాలి నీవో పాల నురగల్లొ తీపి నీవో
బుగ్గే బంగారమా
ఎదలొ జరిగే విరహ సెగల వనవాసం, బదులే అడిగే మొదటి వలపు అభిసేకం
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో , జతగా పిలిచే ఆగరు పొగల సహవాసం
జడతో జగడం జరిగే సరసం ఎప్పుడో..,
అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే అన్ని రంగుల్లో ఆమె రూపే
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే నన్ను మొత్తంగా మాయా చేసే-
-చందమామ