ఎదుట నిలుచుంది చూడు జళతారు వెన్నలేమో
ఎదని తడిమింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచి పోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వాన వీనలా
ఎదుట నిలుచుంది చూడు
నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
ఔనో కాదో అడగకుంది నా మౌనం
చెలివో శిల వో తెలియకుంది నీ రూపం
చెలిని బంధమల్లుకుందే జన్మ ఖైదు లా
ఎదుట నిలుచుంది చూడు
నిన్నే చేరుకోలేక ఎటు వెళ్ళినదో నా లేఖ
వినే వారు లేక విసుక్కుంది నా కేక
నీదొ కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆచోట నా ప్రేమ
వరం లాంటి శాపమేదో సొంతమైంది లా
ఎదుట నిలుచుంది చూడు
ఎదుట నిలుచుంది చూడు జళతారు వెన్నలేమో
ఏదని తడిమింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచి పోయా మాయలో
ప్రాణమంత మీటు తుంటే వాన వీనలా
-వాన
No comments:
Post a Comment